- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోపం మంచికే!
దిశ, వెబ్‌డెస్క్: కొందరు పుట్టుకతోనే వైకల్యంతో పుడతారు. ఆ వైకల్యాన్నే తలదాన్ని విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అది వ్యక్తిగత విజయం. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి వారు పడిన కష్టానికి దక్కిన ఫలితం. అయితే, అదే వైకల్యాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడటానికి, సహాయం చేయడానికి ఉపయోగించినవారు చాలా అరుదు. ఏదైనా ప్రమాదాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ సంభవించినపుడు ముందుగా పిల్లలు, ఆడవాళ్లను కాపాడి ఆ తర్వాత వెంటనే వైకల్యం ఉన్నవారిని కాపాడతారు. కానీ,ఇక్కడ వైకల్యం ఉన్న ఓ వ్యక్తి, ప్రాణాలు కాపాడే బాధ్యతను నిర్వహిస్తున్నాడు. మరి ఆయన వైకల్యం ఏంటి? చేస్తున్న సాహసం ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం..
టర్కీలో ఇటీవల భూకంపం సంభవించింది. అక్కడి క్షతగాత్రులకు సాయం చేయడానికి చాలా మంది వచ్చారు. ఆ సాయం చేస్తున్న వారికి తన అంగవైకల్యంతో రిద్వాన్ సెలిక్ అనే వ్యక్తి సాయం చేస్తున్నాడు. వైకల్యంతో సాయం చేయడం ఏంటని ఆశ్చర్యం పోకండి. ఆ వైకల్యం ఉంది కాబట్టే రిద్వాన్ సాయం చేయగలుగుతున్నాడు. ఇంతకీ రిద్వాన్‌కు వైకల్యం ఏంటో చెప్పలేదు కదూ..అతనొక మరుగుజ్జు. కేవలం మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉండే రిద్వాన్, ఇజ్మిర్‌లో భూకంప బాధితులకు సాయం చేయడానికి వచ్చాడు. నాలుగు రోజులపాటు వారికి సాయం చేస్తూనే ఉన్నాడు. తక్కువ ఎత్తు ఉండటం వల్ల శిథిలాల కిందకి సులభంగా వెళ్లగలిగి క్షతగాత్రులను కాపాడగలుగుతున్నాడు. 1999లో వచ్చిన భూకంపం రిద్వాన్ బాధితుడు కాబట్టి అతనికి శిథిలాల కింద నలిగే పోయేవారి బాధ తెలుసు కాబట్టి ఇలా ఎక్కడ భూకంపం జరిగినా వచ్చి సాయం చేస్తాడని ఇస్తాంబుల్ మీడియా తెలిపింది.