- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మణికే మాగే హితే’ ఇంగ్లిష్‌లోనూ వచ్చేసింది!
దిశ, ఫీచర్స్ : సంగీతానికి భాష అవసరం లేదని ఇప్పటికే ఎన్నో పాటలు ప్రూవ్ చేశాయి. శ్రీలంక వైరల్ సాంగ్ ‘మణికే మాగే హితే’ కూడా సరిహద్దులను దాటి భారతీయ హృదయాలనే కాక ప్రపంచ సంగీతాభిమానుల్లోనూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. సింహళ భాషలో హస్కీ వాయిస్, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో యొహానీ డిలోకా డిసిల్వా అనే సింగర్ పాడిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 17 కోట్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోంది. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు ఫిదా కాగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఏకంగా ఓ రోజంతా ఈ పాట వింటూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇలా ట్రెండింగ్‌లో నిలిచిన ఈ సింహళ సాంగ్ ఇంగ్లీష్ కవర్ వెర్షన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
డచ్ గాయని ఎమ్మా హీస్టర్స్.. ఒరిజనల్ సాంగ్ మెలోడీనెస్, వైబ్స్‌ను ఏమాత్రం పాడుచేయకుండా సింహళ సాహిత్యాన్ని అనువదించి అద్భుతంగా పాడి అందరి హృదయాలు గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త కవర్ వెర్షన్‌ను పోస్ట్ చేస్తూ ఒరిజినల్ సింగర్స్‌ను ట్యాగ్ చేసింది. నిజానికి 2020లోనే రిలీజైన ‘మణికే మాగే హితే’ పాటను సతీషన్, ర్యాపర్ దుల్హన్ ఏఆర్‌ఎక్స్ అనే సింగర్లు పాడారు. స్వయంగా రచయిత అయిన దుల్హన్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు. అప్పట్లోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ పాటను యొహానీ డిలోకా డిసిల్వా 2021లో రీమేక్ చేసింది. అయితే ఆమె కూడా ఊహించని రీతిలో సాంగ్ హిట్ కావడంతో తెలుగు, తమిళ, బెంగాలీ, పంజాబీ, కన్నడ భాషల్లోనూ రీమేక్ చేశారు. ఈ క్రమంలో అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘థ్యాంక్ గాడ్’ (thank god movie) చిత్రంలో యొహాని పాట పాడే చాన్స్ దక్కించుకోగా.. ఇందుకోసం ఆమె హిందీ వెర్షన్‌లో పాడనుంది.
https://www.instagram.com/reel/CVkmOQ4oWVj/?utm_medium=copy_link