- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ ఓటర్లకు దసరా బొనాంజా.. పొలిటికల్ లీడర్ల మాస్ దావత్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఐదు నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచార పర్వంలో ప్రలోభాల జాతరకు అడ్డే లేకుండా పోయింది. వివిధ పార్టీలు అంది వచ్చిన అవకాశాలతో ఓటర్లకు తాయిలాలు అందించే విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే దసరా వేడుక ఇప్పుడు వారికి మరో ప్రచారాస్త్రంగా మారిపోయింది. దసరా సందర్భంగా తెలంగాణలో విందు వినోదాలు జరుపుకునే సంస్కృతి ఆనవాయితీగా వస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియల సమయంలోనే విజయదశమి పర్వదినం కూడా వస్తుండడంతో తామ ప్రచారాన్ని కూడా విజయం వైపు సాగించాలనకుంటున్నాయట కొన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే విందు-వినోదాలు చేసుకోవాలని కొంతమంది నాయకులు నజరానా ప్రకటించే పనిలో నిమగ్నం అయ్యారని తెలుస్తోంది. ఒక్కో తలకి ఇంత, కుటుంబానికైతే ఇంత అని డబ్బులు చెల్లించేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం.
వర్గాల వారీగా..
చిరు వ్యాపారుల నుంచి మొదలు ఓటు బ్యాంకు ఉన్న వారి వరకూ ఏ రంగంలో ఉన్న వారినైనా పసిగట్టి దసరా బొనాంజాలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామాల వారీగా ఈ విందు వినోదాల కోసం అందించే స్పెషల్ ప్యాకేజీలను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 15న దసరా పండగ వస్తున్నందున నాన్ వెజ్ ఐటెమ్స్ తో పాటు విందులు చేసుకునేందుకు ప్రత్యేకంగా జేబులు నింపే ప్రయత్నాలు సాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రాష్ట్ర మంతా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దసరా దావత్‌ల అరెంజ్‌మెంట్స్‌తో ఖర్చు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.