- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో ఆట ఆరంభం.. తనిఖీల్లో రూ. 10.40 లక్షలు సీజ్
దిశ, హుజురాబాద్, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హుజురాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయిని కూడా పోలీసులు ఆపారు.
మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జమ్మికుంట మండలంలో వేర్వేరుగా చేపట్టిన తనిఖీల్లో రూ. 10. 40 లక్షలు సీజ్ చేశారు పోలీసులు. మోత్కులగూడెం వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో రూ. 4 లక్షలు, పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రూ. 5 లక్షలు, రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రూ. 1.40 లక్షలు సీజ్ చేశారు. తనిఖీలు యథావిధిగానే కొనసాగుతాయని సీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఆధారాలు లేకుండా తీసుకెళ్లే నగదును స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
- Tags
- huzurabad