- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఆరోపణలు: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
దిశ, బెల్లంపల్లి: రాజకీయ ఎదుగుదల ఓర్వలేకనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెల్లడించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి చెందిన మహిళా నాయకురాలు పద్మారెడ్డిని బెదిరించినట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని, మహిళలు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన నిబంధనల మేరకు సంబంధిత అధికారులు బిల్లులు చెల్లించాలని సూచించడం మాత్రమే చేసినట్లు తెలిపారు.
బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పటికీ.. సంబంధిత మహిళా నాయకురాలు పద్మారెడ్డి, ఆమె కుమారుడు వంశీకృష్ణారెడ్డి సైతం అమెరికాలో ఉంటూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెరాసను అప్రతిష్టపాలు చేసే కార్యక్రమాన్ని కొనసాగించడం ఏ మేరకు సబబు అన్నారు.