- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుల్కర్ టాలీవుడ్ ఎంట్రీ
దిశ, వెబ్ డెస్క్: విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో దుల్కర్ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ‘ఓకే బంగారం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దుల్కర్.. ఆ తర్వాత మహానటి' సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు వారికి చేరువయ్యాడు. ఆ తర్వాత దుల్కర్ నటించిన కొన్ని మళయాల సినిమాలు తెలుగులో డబ్ చేశారు. ఇటీవల విడుదలైన 'కనులు కనులను దోచావంటే' చిత్రం కూడా తెలుగలో విడుదలైంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలని దుల్కర్ భావిస్తున్నాడు. ఇన్నాళ్లకు దుల్కర్ కు సరైన కథ దొరికిందని, స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'పడి పడి లేచె మనసు' వంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు హను రాఘవపూడికి, దుల్కర్ మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. హను రాఘవపూడి వినిపించిన కథకు, దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ‘మహానటి’ సినిమాను నిర్మించిన ‘స్వప్న సినిమా’ బ్యానర్ మీదే ఈ సినిమా కూడా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
tags: dulquer salmaan, bollywood, telugu cinema, hanu raghavapudi