- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాదిలో 12 కొత్త బైకులను తీసుకురానున్న డుకాటి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి దేశీయ మార్కెట్లో తన విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. కొత్త ఏడాదిలో బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మొత్తం 12 కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. 2021లో తీసుకొచ్చే బైకులలో తక్కువ బడ్జెట్ మోటార్‌సైకిళ్లతో పాటు ప్రీమియం హై-ఎండ్ లగ్జరీ మోటార్‌సైకిళ్లను కూడా తీసుకురానున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో మొదటగా బీఎస్6 ప్రమాణాలతో డుకాటి స్క్రాబ్లర్ కొద్దిరోజుల్లో మార్కెట్లోకి రానుందని తెలిపింది.
గతేడాది కరోనా సంక్షోభం వల్ల కేవలం బీఎస్6 ప్రమాణాలతో కేవలం 3 బైకులను మాత్రమే తెచ్చామని, అందుకే ఈ ఏడాది ప్రణాళిక విస్తృతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. మిగిలిన కొత్త వేరియంట్లలో మల్టీస్ట్రాడా వీ4, స్ట్రీట్‌ఫైటర్ వీ4, మాన్‌స్టర్, సూపర్‌స్పోర్ట్ 950, స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ బైకులు అప్‌డేట్ వెర్షన్లతో పాటు బీఎస్6 ఇంజిన్అతో తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘2020లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో సవాళ్లను ఎదుర్కొన్నాం. 2021 ఏడాది తమకు అత్యంత విలువైన, ఉత్సాహంగా ఉండే సంవత్సరంగా భావిస్తున్నం. ఈ ఏడాదిలో ప్రతి త్రైమాసికంలోను కొత్త ఉత్పత్తులతో వినియోగదారులకు ఆకట్టుకుంటామని’ డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర చెప్పారు.