- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతన్ని నేనే చంపుదామనుకున్నా : దూబే భార్య
దిశ, వెబ్‌డెస్క్ :
యూపీలో 8మంది పోలీసుల మరణానికి కారణమైన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను యోగి సర్కార్ ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య రిచా తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిది మంది పోలీసులను చంపి వారి కుటుంబాల్లో విషాదం నింపిన తన భర్తను తానే చంపాలని అనుకున్నట్లు చెప్పారు. దుబే అకృత్యాలన్ని తనకు తెలుసునని వివరించారు. తన భర్త చేసిన పనికి సమాజంలో ముఖం చూపించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. జూలై 3వ తేదీ అర్థరాత్రి సమయంలో తనని, పిల్లల్ని తీసుకుని ఊరి నుంచి వెళ్లి పోవాలని చెప్పాడు. వెంటనే అతడ్ని తిట్టి పంపించినట్లు ఆమె మీడియాకు తెలిపారు.తర్వాత పిల్లలతో కలిసి లక్నోలోని బంగ్లాలో తలదాచుకున్నానని తెలిపారు. అంతేకాకుండా దుబేకు కొద్దిరోజుల కిందట యాక్సిడెంట్ జరిగిందని, అతడి తలలో బబూల్ వచ్చిందని రిచా వెల్లడించింది. అప్పటినుండి దూబే ఎక్కువగా కోపంగా ఉంటున్నాడని తెలిపింది. తన బాధ అంతా పిల్లల గురించే అని అత్తింటి వారు, పుట్టింటి వారు ఎవరూ తన పిల్లల్ని చూసుకోరని దుబే భార్య ఆవేదన వ్యక్తం చేసింది.