ముగిసిన దుబ్బాక పోలింగ్..

by Anukaran |   ( Updated:2020-11-03 07:35:36.0  )
ముగిసిన దుబ్బాక పోలింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో కఠినమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే, ఓటింగ్ జరిగే పరిస్థితిని సాయంత్రం 4గంటల ప్రాంతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు భారతి హోళీకేరి ఓటింగ్ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, అధికారులకు తగు సూచనలు చేశారు.

దుబ్బాక ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా, 2018 ముందస్తు ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed