- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు ఆ అధికారం లేదు.. అరెస్ట్ చేస్తామంటూ వీడీసీలకు DSP వార్నింగ్
దిశ, నిర్మల్ రూరల్ : సమాంతర సర్కారుగా మారుతూ గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. సోన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.
మండలంలోని కడ్తాల్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం వీడీసీ సభ్యులు ఇచ్చిన తీర్పుతో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన 15 మంది వీడీసీ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వీడీసీ సభ్యులు కేవలం గ్రామాభివృద్ధికి పాటుపడాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని తెలిపారు.
గ్రామాల్లో వీడీసీ సభ్యులు పెత్తనం చెలాయిస్తే.. తమ దృష్టికి తీసుకురావాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి పేరిట దాడులకు పాల్పడటం, సామాజిక బహిష్కరణ లాంటివి చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వీడీసీ సభ్యులపై రౌడీ షీట్ కేసు నమోదు చేయడానికి వెనుకాడబోమని అన్నారు. ఈ సమావేశంలో సీఐ జీవన్ రెడ్డి, ఎస్‌ఐ ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.