- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ప్రశాంతంగా ఉన్న సరిహద్దు పల్లెల్లో మళ్లీ అలజడి’
దిశ, కాటారం: మహమ్మారి వైరస్‌తో పాటు మావోయిస్టులను కూడా తిప్పి కొట్టాల్సిన బాధ్యత సరిహద్దు ప్రాంత పోలీసులపై ఉందని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు మొదలు కావడంతో ఠాణాల్లో అప్రమత్తతమై క్షేత్ర స్థాయి పర్యటను చేపట్టారు. సోమవారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషన్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు సబ్ డివిజన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మావోల ఏరివేతపై దృష్టి సారించాలన్నారు. కరోనా విషయంలో అయినా, మావోల విషయంలో అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు పల్లెల్లో అలజడి లేపేందుకు మావోయిస్టులు వస్తున్నారని డీఎస్పీ ఆరోపించారు. డీఎస్పీ వెంట కాటారం సీఐ హథీరాం, ఎస్సై శ్రీనివాస్ లు ఉన్నారు.