- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8న మరోసారి డ్రై రన్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి డ్రై రన్ నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 8న అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్టు బుధవారం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడంలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను గుర్తించి సరిచేసుకోవడానికి, కొవిన్ అప్లికేషన్ పనితీరును సమీక్షించడానికి డ్రై రన్ ఉపకరించనుంది.
గతనెల 28, 29న తొలిసారి నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించగా ఈ నెల 2న తొలిసారి దేశవ్యాప్తంగా ట్రయల్ రన్ చేపట్టారు. తాజాగా మరోమారు శుక్రవారం దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించనున్నారు. కరోనా టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ అత్యవస వినియోగ అనుమతులు పొందిన నేపథ్యంలో ఈ డ్రై రన్ నిర్వహించడం గమనార్హం. అత్యవసర వినియోగ అనుమతులు పొందిన తేదీ(ఈ నెల 3) నుంచి పది రోజుల్లో(ఈ నెల 13లోపు) వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. అంటే వచ్చే వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ దశలవారీగా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.