ఈ నెల 25న నిజమేంటో తెలుస్తుంది: హీరో వెంకటేశ్

by Shyam |   ( Updated:2021-11-12 09:37:58.0  )
ఈ నెల 25న నిజమేంటో తెలుస్తుంది: హీరో వెంకటేశ్
X

దిశ, సినిమా: అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఇంటిపెద్ద కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’. వెంకటేశ్, మీనా ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించగా.. ‘దృశ్యం-2’ (Drushyam2) ను కూడా తెరకెక్కించారు మేకర్స్. అయితే కొవిడ్ కారణంగా మూవీ రిలీజ్ వాయిదా పడగా.. ఈ నెల 25 నుంచి ఓటీటీలో స్ర్టీమ్ కానుందని తెలిపారు మేకర్స్. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వెంకీ.. ‘నిజం బట్టబయలవడం ప్రారంభించింది,ఇక ప్రతీ ప్రశ్న రాంబాబుకి శాశ్వత మచ్చ మిగిల్చిందా?’ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ మూవీపై క్యూరియాసిటీ పెంచాడు. మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్.. తెలుగులోనూ డైరెక్ట్ చేయడం విశేషం.

Advertisement

Next Story