- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూరల్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు : సీపీ సజ్జన్నార్
దిశ, క్రైమ్ బ్యూరో : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్భన్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాలు తగ్గినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే, ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు అత్యధికంగా రూరల్ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో రూరల్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టేందుకు ప్రత్యేక ఫోకస్ చేయనున్నట్టు సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలి కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తో కలిసి సీపీ సజ్జనార్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ డిసెంబరు 27 నుంచి జనవరి 4 వరకూ మొత్తం 3510 డ్రంకెన్ డ్రైవ్ కేసులలో అత్యధికంగా 65 శాతం టూ వీలర్లు, 30 శాతం ఫోర్ వీలర్లు ఉన్నాయన్నారు. ఈ డ్రంకెన్ డ్రైవ్ లో అత్యధికంగా ఫోర్ వీలర్లను, పబ్బులు ఉండే ప్రాంతాల్లోనే నిర్వహిస్తారనే అపోహాలు నిజం కాదని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చేపట్టిన తనిఖీలలో చాలా వరకూ వాహనదారులు ప్రత్యామ్నాయం సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారని, అందులో భాగంగా స్ప్రేర్ డ్రైవర్లు, క్యాబ్, ఆటో లలో వెళ్లిన విషయాలను గమనించినట్టు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అర్బన్ ప్రాంతాలైన కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాలు దుండిగల్, బాచుపల్లి, షామీర్ పేట, శంకర్ పల్లి, మొయినాబాద్, కొత్తూరు, కర్తాల్ తదితర రూరల్ ప్రాంతాల్లో అధికంగా నమోదయినట్టు వివరించారు. ఈ ప్రమాదాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో జరుగుతున్నాయని అన్నారు. దీంతో రూరల్ ప్రాంతాల్లో కూడా డ్రంకెన్ డ్రైవ్ చేపట్టేందుకు ప్రధాన ఫోకస్ పెడుతున్నామని అన్నారు. ఇక నుంచి ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వాహనదారులను హెచ్చరించారు. పార్టీలు, ప్రత్యేక శుభకార్యాలు నిర్వహించుకునే సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేయోద్దని సూచించారు.