- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసులో పోలీసుల రైడ్స్.. భయపడి బాత్‌రూమ్‌లో దాక్కున్న నటి.!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం సౌత్ ఇండియాలో డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటులు ఈ కేసులో పోలీసుల ఎదుట విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్ణాటకలో మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనంగా మారింది.
బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో.. నటి, మోడల్, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్, మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు. వీరికీ నైజీరియా డ్రగ్స్పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రైడ్స్‌లో భాగంగా పోలీసులు రాజాజీ నగర్‌లోని నటి సోనియా ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 40 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో సోనియా లేదు. ఓ హోటల్‌లో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది సోనియా. చివరకు.. బాత్రూంలో దాక్కున్న ఆమెను పోలీసులు బయటకు లాక్కొచ్చారు.
అనంతరం పోలీసులు విచారణ జరపగా సోనియా.. నైజీరియా డ్రగ్స్ వ్యాపారి థామస్‌తో తనకు పరిచయం ఉందని, పార్టీలకు డ్రగ్స్‌సరఫరా చేసినట్లు అంగీకరించింది. ఇదే సమయంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు వ్యాపారవేత్త భరత్ ఫ్లాట్‌లో జరిగే డ్రగ్స్ పార్టీలకు హాజరవుతారన్న విషయం బయటకు వచ్చింది.
అయితే.. కన్నడ సోషల్ మీడియా చూపించిన అత్యుత్సాహం నటి సోనియా అగర్వాల్‌కు తల నొప్పిని తెచ్చిపెట్టింది. సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక, ‘7/జీ బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఫోటోలను డ్రగ్స్ వార్తతో పాటు పోస్ట్ చేశాయి. కొందరైతే.. నటి సోనియా అగర్వాలే డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు పేర్కొన్నారు.
ఈ వార్త కాస్తా నటి సోనియా అగర్వాల్‌కు చేరే సరికీ జరగాల్సిన పబ్లిసిటీ మొత్తం జరిగిపోయింది. అయితే తాను తమిళ చిత్రం ‘గ్రాండ్ మా’ షూటింగ్‌లో భాగంగా కేరళలో ఉన్నట్టు ఓ ఆడియోను విడుదల చేసింది. తన గురించి తప్పుగా రాసిన వెబ్ సైట్స్, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని పేర్కొంది. జర్నలిస్టులు సరైన హోమ్ వర్క్ చేయకుండా తన పరువునకు భంగం కల్పించారంటూ సోనియా అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Here my 2 cents for the media and for the journalist’s who doesnt bother to do their home work properly and is very eager to print and defame a person without any investigation…,whilst I am in Kerala shooting for my new project. https://t.co/RNbYZmJTVr
— Sonia aggarwal (@soniya_agg) August 30, 2021