2 డీజీ డ్రగ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు డీఆర్‌డీవో ఓకే

by Shamantha N |
2 డీజీ డ్రగ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు డీఆర్‌డీవో ఓకే
X

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో భాగంగా అందించే 2 డీజీ డ్రగ్ టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్‌ ప్రైవేటు ఫార్మా సంస్థలకు బదిలీ చేయడానికి ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీవో నిర్ణయించింది. 2 డీజీ డ్రగ్‌ను బల్క్‌గా ఉత్పత్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు ఆసక్తి గల ఫార్మా సంస్థలను ఆహ్వానించింది. 2 డీజీని డీఆర్‌డీవోకు చెందిన ఇన్మాస్ ల్యాబ్, రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో కరోనా పేషెంట్లు వేగంగా కోలుకోవడానికి, ఆక్సిజన్ అవసరాలను తగ్గించడానికి ఈ ఔషధం దోహదపడుతున్నట్టు తేలింది. ఈ మందు టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆసక్తి గల కంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌డీవో తెలిపింది. జూన్ 17లోగా మెయిల్ ద్వారా తమ ఆసక్తిని కనబరచాలని వివరించింది. వీటిని టెక్నికల్ అసెస్‌మెంట్ కమిటీ పరిశీలిస్తుందని, తొలిగా దరఖాస్తు చేసుకున్న 15 కంపెనీలకు టెక్నాలజీని బదిలీ చేస్తుందని పేర్కొంది. ఆ కంపెనీలు ఏపీఐ డ్రగ్ తయారుచేయడానికి లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed