- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసిక వైద్యశాల నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్
దిశ ఏపీ బ్యూరో: హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ అయ్యారు. మానసిక ఆస్పత్రిలో అక్రమంగా నిర్బంధించారని.. తన కుమారుడిని కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుధాకర్ తల్లి కావేరీబాయి హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆయనను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. దీంతో తనను డిశ్చార్జ్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని చెబుతూ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ పోలీసు కస్టడీలో లేరని, మెరుగైన వైద్యం కోసం విశాఖ మానసిక వైద్యశాలకు తరలించినట్టు తెలిపారు. ఆయన డిశ్చార్జ్ కావాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు, సీబీఐ కూడా సుధాకర్ తమ కస్టడీలో లేరని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, సీబీఐ దర్యాప్తునకు మాత్రం సహకరించాలని కోరింది. కాగా, సుధాకర్‌కు ఇంకా చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, వేరే ఆసుపత్రిలోనైనా చేర్పించి చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు సూచించడం గమనార్హం.