- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పని ఎందుకు చేస్తలేవని అడిగినందుకు.. కూతురి అఘాయిత్యం
దిశ, కల్వకుర్తి : ఇంట్లో పనులు చేయడం లేదని తల్లి మండలించడంతో మనస్తాపం చెందిన యువతి నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఊరుకొండ మండలం బొమ్మరాశిపల్లిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం.. బొమ్మరాశిపల్లికి చెందిన షానమోని బాలమణి అనే మహిళ తన కూతురు శిరీష(19)ను ఇంటి పనులు చేయట్లేదని మందలించింది. దీంతో శిరీష తాను పని చేసే మామిడి తోట నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది.
రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు తల్లి బాలమణి పోలీసులను ఆశ్రయించడంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మామిడి తోటలో సిబ్బందితో కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా అక్కడున్న నీటి గుంతలో శవమై కన్పించిందన్నారు. తల్లి మందలించినందుకే నీటి గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ధృవీకరణకు వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.