- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్ గదిలో ‘డబుల్’ శృంగారం.. ముందు లవర్, తర్వాత భార్య! బాత్రూంలో ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరాయి స్త్రీలతో సుఖం పొందాలనుకుంటున్నారు కొందరు పురుషులు. ఇల్లాలును మభ్యపెట్టి, మస్కా కొట్టి ఇతరులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే పురుషుల్లో ఈ ఒరవడి మరీ ఎక్కువ ఉన్నట్లు క్రైం గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు ఓ భర్త. బిజినెస్ ట్రిప్ అని భార్యకు అబద్దం చెప్పి ఏం చక్క లవర్‌తో ఎంజాయ్ చేయడానికి వెళ్లి అడ్డంగా బుక్కాయ్యాడు. సినిమా ట్విస్టులను తలపించేలా ఉన్న ఈ క్రైం స్టోరీ న్యూజిలాండ్‌లో జరిగింది.
న్యూజిలాండ్‌కు చెందిన జాంగ్ తన భార్య నాన్సీతో కలిసి ఆక్లాండ్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేసే జాంగ్.. తోటి ఉద్యోగినితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే వారిద్దరి కలిసి రొమాన్స్ చేసుకోవాలనుకున్నారు. ఆక్లాండ్‌లోనైతే తెలిసిపోతుందని.. విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేద్దామనుకున్నారు. దీనిలో భాగంగా జాంగ్.. గత వారం బిజినెస్ ట్రిప్ పేరుతో ప్రియురాలితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో రూం తీసుకొని ఇద్దరు కలిసి రాసలీలల్లో మునిగిపోయారు.
అయితే ఇవేమి తెలియని జాంగ్ భార్య నాన్సీ తమ పెళ్లి రోజు కానుకగా భర్తకు ఓ మెమోరబుల్ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంది. వెంటనే ఆమె కూడా ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో తన భర్త ఉన్న హోటల్ గదికి వెళ్లింది. అప్పటికే ప్రియురాలితో కామక్రీడల్లో ఉన్న భర్త.. కాలింగ్ బెల్ విని డోర్ కన్నం నుంచి భార్యను చూసి షాక్ తిన్నాడు. వెంటనే ప్రియురాలిని బాత్రూంలో దాక్కొమని చెప్పాడు. ఆ తర్వాత డోర్ తెరిచి భార్యను ఆహ్వానించాడు. అయితే తమ పెళ్లిరోజు సర్ ప్రైజ్‌గా ఈ రోజంతా మనిద్దరం ఏకాంతంగా గడపాలని ఆమె కోరింది. అయితే ముందు రెస్టారెంట్‌కు వెళ్దామని భార్యను బలవంతం చేశాడు. కానీ ముందు రొమాన్స్ తర్వాతనే ఏదైనా అంటూ ఆమె అతడిని బెడ్ పైకి తోసింది.
ఇక తప్పని పరిస్థితుల్లో భార్యతో శృంగారంలో పాల్గొనక తప్పలేదు. ఇదే సమయంలో బాత్ రూంలో ఉన్న ప్రియురాలు వెయిటింగ్ చేయలేక జాంగ్ సెల్‌కు మెసేజ్‌లు చేసింది. అయితే వరసబెట్టి భర్త సెల్‌కు మెసేజ్‌లు వస్తుండటంతో భార్య వాటిని ఓపెన్ చేసి చూసింది. దీంతో భర్త రాసలీలలు బయటపడ్డాయి. వెంటనే బాత్ రూంలోకి వెళ్లి అతడి ప్రియురాలికి బయటకు లాక్కొచ్చి గొడవకు దిగింది. వాళ్ల ఘర్షణను చూసిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దంపతులకు సర్ధి చెప్పి న్యూజిలాండ్ పంపించారు. అక్కడికి వెళ్లగానే భర్త నుంచి విడాకులు కోరుతూ నాన్సీ కోర్టులో కేసు వేసింది.