లాటరీ విధానంలో ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక

by Shyam |
లాటరీ విధానంలో ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక
X

దిశ, మహబూబ్ నగర్: సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డబుల్ ఇళ్లను లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని వీరన్న పేట్‌లో అన్ని వసతులతో 650 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామన్నారు. ప్రతీ పేదవాడి సొంతింటి కలను నేర వేర్చడమే తమ లక్ష్యమని, ఇక్కడ ఇళ్లు లేని 100మంది ఎస్సీలకు డబుల్ ఇళ్లు ఇవ్వనునట్లు ప్రకటించారు. అలాగే, మైనార్టీలకు 12శాతం కేటాయిస్తున్నామన్నారు. వీరన్నపేట్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూముల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, అక్కడే పాఠశాల నిర్మాణం కూడా చేపడతామని వివరించారు. ఎవరైనా దళారుల అవతారం ఎత్తి డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల13న కేటీఆర్ డబుల్ ఇళ్లను ప్రారంభిస్తారని, ఆ ప్రాంతంలో అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed