- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం కీలక నిర్ణయం.. 6జీ టెక్నాలజీ రీసెర్చ్ కోసం 'ఇన్నోవేషన్ గ్రూప్'
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 5జీ టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాకముందే.. కేంద్రం 6జీపై పనులు మొదలుపెట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం టెలికాం విభాగం(డీఓటీ) తాజాగా 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా సాంకేతికత అభివృద్ధిలో ముందుండేందుకు టెలికాం సెక్రటరీ కె రాజారామన్ చైర్‌పర్సన్‌గా దీన్ని ఏర్పాటు చేసారు. రాజారామన్ నాయకత్వంలో ఈ గ్రూప్ తర్వాత జనరేషన్ 6జీ టెక్నాలజీ లక్ష్యాలను రూపొందించనున్నారు. పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్‌డీ), ఉత్పత్తులు, అప్లికేషన్ల అభివృద్ధి, 6జీ సాంకేతికత కోసం ఖచ్చితమైన రోడ్‌మ్యాప్ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.
‘భారత్ 6జీ సాంకేతికతలో ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ప్రభుత్వం, పరిశ్రమ, టెలికాం పరిశ్రమ ప్రొవైడర్లు, విద్యా, పరిశోధనా సంస్థల ఆవిష్కరణకు, మేధో సంపత్తి హక్కుల కోసం పరస్పరం సహకారాన్ని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను రూపొందించడం, పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయడం, తయారీ, పరీక్షించడం, సరఫరా లాంటి అంశాలను రూపొందించనున్నట్టు టెలికాం విభాగం తాజా ఉత్తర్వుల్లో వివరించింది. కొత్తగా ఏర్పాటైన 22 మంది సభ్యుల బృందంలో అదనపు కార్యదర్శిగా అనితా ప్రవీణ్ సహా దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఉన్నారు.