- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాను ఆషామాషీగా తీసుకోవద్దు : మంత్రి ఈటల
కరోనా వైరస్‌ను ఆశామాషీగా తీసుకోవద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. బుధవారం కోఠి ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికే నిర్దారణ అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రజలెవరూ వైరస్ బారిన పడలేదని, ఇకమీదట కూడా పడకుండా ఉండేందుకే ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను మూసివేయించామన్నారు. ప్రజలు ఎక్కడ గుంపులుగా సంచరించవద్దని, పిల్లలను బయట తిరగనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. విదేశాల నుంచి నగరానికి వచ్చేవారికి క్వారంటైన్ చేస్తున్నామని, రానున్నరోజుల్లో మరో 20వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అంతమందికి సరిపడా దూలపల్లి, వికారాబాద్‌లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులను తరలించేందుకు 40ప్రత్యేక బస్సులకు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాగా, గాంధీ, ఉస్మానియాలోని ఐపీఎంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
Tags: carona, minister etala rajender, 2ok people coming, 40 buses, airport, dont go outside