- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
దిశ, బేగంపేట: కొవిడ్ మహమ్మారి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర క్యాబినెట్ హోదా వచ్చిన తర్వాత మొదటిసారిగా సోమవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ సుచిత్రతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారిని వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు కేంద్ర ప్రభుత్వ తలుపులు తడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాగా, కేంద్ర మంత్రి రాక సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, భాజపా శ్రేణులు మంత్రి కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
పూజ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డిని ఆలయ ఈఓ మనోహర్‌రెడ్డి, అర్చకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకుడు మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, మేకల సారంగపాని, డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్, ఎస్ ఆర్ మల్లేష్, శ్రీనివాస్, నరేందర్, మదన్, స్వప్న, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.