భయపడొద్దు.. ఏటీఎంలోకి పాము వచ్చింది

by Shamantha N |
భయపడొద్దు.. ఏటీఎంలోకి పాము వచ్చింది
X

దిశ, వెబ్ డెస్క్: ఏటీఎంలోకి మనుషులు పోతారు. ఇదేందీ ఏటీఎంలోకి పాము రావడమేంటీ అని అనుకుంటున్నారా?… అయితే వీడియోను చూడండి. నిజమే కదా.. ఏటీఎంలోకి పాము వచ్చింది కదా..! విషయమేమిటంటే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో జనాలు డబ్బులు డ్రా చేసుకుంటుండగా ఓ పాము చొరబడింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న వాచ్ మెన్ ఏటీఎం డోర్ లాక్ చేసి పాములు పట్టేవారికి సమాచారమిందించాడు. ఆ సమయంలో ఆ పాము ఏటీఎంలో అటు ఇటు తిరిగి, ఏటీఎం పైభాగంలో ఉన్న రంద్రంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది.

Advertisement

Next Story