ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా మారండి..!

by  |
ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా మారండి..!
X

దిశ, హన్మకొండ: ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు. హన్మకొండ కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించబడిన వాల్ పోస్టర్లను సోమవారం సీపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్, ఈస్ట్ జోన్ల ఇంచార్జ్ డీసీపీలు పుష్ప, వెంకటలక్ష్మీ, అదనపు డీసీపీ గిరిరాజు, వరంగల్, కాజీపేట ఏసీపీలు ప్రతాప్, రవీందర్ కుమార్, ఆర్.ఐ నగేష్ పాల్గొన్నారు.

అనంతరం సీపీ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స నిమిత్తం అత్యవసర సమయాల్లో కావాల్సిన ప్లాస్మాను సమకూర్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా కొవిడ్-19 కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వ్యాధి నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా వున్న దాతల పూర్తి సమాచారాన్ని ఈ సెంటర్ ద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు. ప్లాస్మా అవసరమైన వారు కొవిడ్ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 9491873930 కు పూర్తి సమాచారాన్ని అందజేస్తే వారికి దాతల వివరాలను అందజేస్తామని తెలిపారు.



Next Story