ట్రంప్ ఉచ్ఛారణ దోషం.. నవ్వించిన ఐసీసీ

by Shyam |
ట్రంప్ ఉచ్ఛారణ దోషం.. నవ్వించిన ఐసీసీ
X

డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యాంలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో సిద్ధహస్తుడు. వైరం కొనితెచ్చుకునే దేశాలపై దూకుడైన చర్యలుతో దారికి తెచ్చుకునే నేర్పరి. భారత పర్యటనలో ట్రంప్ భాషాదోషాలు నెటిజన్లను నవ్వులమయం చేశాయి. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భారతీయులను ఆకట్టుకునేలా ప్రసంగించడంలో భాగంగా టీమిండియా దిగ్గజాలు సచిన్, కోహ్లీల పేర్లను ఉచ్ఛరించారు.

ఈ ఉచ్ఛారణలో దోషం ఉండడంతో ముందు క్రికెటర్ల పేర్లు నేర్చుకో అని హితవు పలుకుతూ ఐసీసీ వ్యంగ్యమైన ట్వీట్ చేసింది. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్రంప్ ప్రసంగంలో సచిన్‌కు బదులుగా సొ-చిన్ తెండూల్కర్ అని, విరాట్‌ను విరాట్ కోలీ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ట్రంప్ ఉచ్ఛారణపై విరుచుకుపడ్డారు.

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. సచిన్ లాంటి దిగ్గజాల పేరును ఉచ్ఛరించేటప్పుడు తగినంత రీసెర్చ్ చేయాలని సూచించాడు. ఇక ఐసీసీ అయితే సచిన్ పేరును గుర్తుంచుకోవాలంటే.. sach (సాచ్), such (సచ్), satch (సేచ్), sutch (సుట్చ్), sooch (సూచ్) లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా అని ఎద్దేవా చేస్తూ ఐసీసీ అభిమానులను తుంటరిగా ప్రశ్నించింది. ఇవి నెటిజన్లలో నవ్వులు పూయిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed