వలసలపై నిషేధం 60 రోజులే : ట్రంప్

by vinod kumar |
Trump
X

వాషింగ్టన్ : తమ దేశంలోనికి వలసదారులను రానివ్వకుండా తీసుకునే నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ నిషేధం కేవలం 60 రోజులు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. తమ పౌరుల ఉద్యోగాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన అమెరికాలో శాశ్వత నివాస హోదాలా(గ్రీన్ కార్డు) కోసం ప్రయత్నించే వారిని లక్ష్యంగా ఉంచుకొనే ఈ ఉత్తర్వులు అమలులోనికి తెస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా కారణంగా అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ట్రంప్ ముందున్న తొలి సవాలు. రాబోయే రోజుల్లో స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో వలసల నిరోధక చట్టాన్ని అమలులోనికి తెచ్చినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు వలసలను ఆపితే అమెరికా పౌరులు ఉద్యోగాలు సంపాదించుకుంటారని ట్రంప్ భావిస్తున్నారు.

Tags: america, donald trump, sanctions, green card, immigrant, employees

Advertisement

Next Story

Most Viewed