ట్రంప్ కరోనా బారిన పడ్డారా..?

by vinod kumar |
ట్రంప్ కరోనా బారిన పడ్డారా..?
X

వాషింగ్టన్ : ప్రతీ రోజు ఏదో ఒక సంచలన విషయం చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. గత 10 రోజులుగా తాను మలేరియా మాత్రలు (హైడ్రాక్సీక్లోరోక్విన్) వేసుకుంటున్నానని వెల్లడించారు. దీంతో అమెరికా ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ట్రంప్ కరోనా బారిన పడ్డారంటూ ప్రచారం జరిగింది. రోజుకో మాత్ర చొప్పున హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు తీసుకుంటున్నానని.. తనకు వైరస్ లక్షణాలు లేకపోయినా.. ఈ మాత్రలే వేసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఇదే విషయం వైట్ హౌస్ డాక్టర్‌కు చెప్పినా.. ఆయన అభ్యంతరం చెప్పలేదని ట్రంప్ అన్నారు. కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బంది ఈ మాత్రలను తీసుకుంటున్నారని.. వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని తేలడంతో తానూ ఈ మాత్రలు వాడుతున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో దుమారం చెలరేగడంతో వైట్ హౌస్ వైద్యులు రంగంలోకి దిగారు. ట్రంప్‌కు కరోనా సోకలేదని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ప్రకటించారు. తరచుగా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారని.. ప్రతీ సారి నెగెటివ్ ఫలితాలే వస్తున్నాయని డాక్టర్ కోన్లీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed