- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన డామ్ బెస్
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ స్పిన్నర్ డామ్ బెస్ తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు. న్యూజీలాండ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం డామ్ బెస్‌కు పిలుపు వచ్చింది. ఈ మేరకు ఇంగ్లాండ్ సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినట్లు తెలియగానే డామ్ బెస్ తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు. ఇప్పటికే జాక్ లీచ్ జట్టుతో పాటు ఉన్నాడు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అతడిని రీప్లేస్ చేయవలసి వస్తే డామ్ బెస్‌ను ఉపయోగించుకుంటమని ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ చెప్పారు.
కాగా, తొలి టెస్టు అనంతరం పేసర్ ఓలీ రాబిన్‌సన్‌ను ఈసీబీ సస్పెండ్ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం అతడు చేసిన ట్వీట్ల నేపథ్యంలో అతడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ చర్చ ఇంకా నడుస్తుండగానే డామ్ బెస్ అకౌంట్ డీయాక్టివేట్ అవడం చర్చనీయాంశంగా మారింది. మరో ఇంగ్లాండ్ క్రికెటర్ కూడా వివక్ష పూరిత ట్వీట్లు చేసినట్లు విస్డెన్ వెబ్‌సైట్ బయటపెట్టింది. దీనిపై కూడా ఈసీబీ విచారణ మొదలు పెట్టింది.