ఇదీ డాలర్ శేషాద్రి ప్రస్థానం..

by srinivas |   ( Updated:2021-11-29 11:35:26.0  )
Seshadri
X

దిశ, ఏపీ బ్యూరో: 1948 జూలై 15న తిరుపతిలో డాలర్ శేషాద్రి జన్మించారు. డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. అయితే వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తితో 1978లో టీటీడీలో ఉత్తర పార్‌పత్తేదార్‌గా ఉద్యోగంలో చేరారు. 2007లో బొక్కసం ఇన్‌చార్జీగా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఆయన సేవలు అవసరమని భావించిన టీటీడీ ఓఎస్డీగా అవకాశం కల్పించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. డాలర్ శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

Advertisement

Next Story