కుక్క పరిమాణంలో ఉండే తేలు చూశారా.. అయితే మీ కోసమే..

by Sujitha Rachapalli |
కుక్క పరిమాణంలో ఉండే తేలు చూశారా.. అయితే మీ కోసమే..
X

దిశ, ఫీచర్స్ : కుక్క పరిమాణంలో ఉండే తేలును మీరు ఎప్పుడైనా చూసారా? లేదా వాటి గురించి విన్నారా? కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ ‘నాన్జింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ పాలియోంటాలజీకి చెందిన శాస్త్రవేత్తలు.. ఇటీవల దక్షిణ చైనాలోని సముద్రపు అడుగుభాగాన మీటర్ పొడవుగల సముద్రపు తేలు శిలాజాన్ని కనుగొన్నారు.

పరిశోధకులు కనీసం 400 మిలియన్ ఏళ్ల కిందట సగటు తేళ్ల పరిమాణం కంటే 16 రెట్లు ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. వీరు చైనా సముద్రపు ఒడ్డున స్కార్పియన్ శిలాజ అవశేషాలను కనుగొన్నారు. ‘టెర్రోప్టెరస్ జియుషానెన్సిస్’గా పిలిచే ఈ తేళ్లు డాగ్-సైజ్‌లో ఉండేవి. ప్రస్తుత హార్స్‌షూ క్రాబ్, విప్ స్పైడర్‌కు చెందిన అరాక్నిడ్ జాతికి చెందినవని, జెయింట్ స్విమ్మింగ్ బీస్ట్ మిక్స్‌ప్టెరిడే కుటుంబంలో ఒక భాగమని పరిశోధకులు వెల్లడించారు. ఈ స్కార్పియన్‌లు ముళ్ల మాదిరి స్పైనీ అటాకింగ్ చేతులు కలిగి ఉన్నాయని తెలిపారు.

ఈ జీవి ఎక్కువగా స్కాట్లాండ్, న్యూయార్క్, నార్వే, ఎస్టోనియా చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే ఉండేదని భావించగా, తొలిసారి దక్షిణ చైనా ప్రాంతానికి సమీపంలో దీని శిలాజాలు లభించాయి. మిలియన్ ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని గోండ్వానా అని పిలిచేవారు. ప్రస్తుతం లభించిన శిలాజాలు ఈ భారీ సముద్ర జీవుల వైవిధ్యత, ఉనికితో పాటు మరెన్నో అంశాలపై మరింత అవగాహన అందించే అవకాశముంది. ఎర్లీ సైలూరియన్ సమయంలో పెద్ద సకశేరుకాలు లేనప్పుడు టెర్రోప్టెరస్ సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇవే టాప్ ప్రిటేడర్స్ పాత్రను పొషించి ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

శిలాజాల ఆధారంగా తేలు వెన్నెముక నమూనాలను గమనించగా.. ఇవి రాత్రి సమయంలో వేటాడేందుకు అసాధారణ వ్యూహాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ చివరకు సొరచేపలు, ఆధునిక మాంసాహార జీవులు సముద్రంలోకి వచ్చినప్పుడు ఈ స్కార్పియన్స్.. చైనీస్ సముద్రంపై తమ పట్టు కోల్పోవడంతో పాటు ఉనికిలో లేకుండా పోయాయని పరిశోధకులు పేర్కొన్నారు.

443.8 – 419.2 మిలియన్ సంవత్సరాల క్రితం సిలురియన్ కాలంలో కుక్క-పరిమాణమంత స్కార్పియన్స్ ఉనికిలో ఉన్నాయి. బార్రాకుడాస్ లేదా సొరచేపల ఆగమనానికి చాలా కాలం ముందే సముద్రపు తేళ్లు అగ్ర మాంసాహారులుగా పరిగణించబడ్డాయి. ఇవి సూది లాంటి స్పైక్‌లతో పాటు తోకల్లో కూడా స్పైనీ (ముళ్లలాంటి నిర్మాణాలు) కలిగి ఉన్నాయి. ఇవి ఈ స్పైనీలనే ఆయుధాలుగా మలచుకుని తమ శత్రువులను ఢీకొట్టేవి. ఇతర జీవులను పట్టుకోవడానికి కూడా వాటినే ఉపయోగించేవి.
– శాస్త్రవేత్తల బృందం

Advertisement

Next Story

Most Viewed