- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులుకు తలనొప్పిగా వైద్యాధికారుల అలసత్వం
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన బాధితులు రొడెక్కి రాస్తారోకో చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కరోనా టెస్టుల నిర్వహణ సెంటర్ వద్ద అర్ధాంతరంగా టెస్టులు నిలిపివేయడంతో ఆగ్రహించిన బాధితులు రోడ్డుపై బైఠాయించారు. గంటలతరబడి క్యూలైన్లలో నిలుచున్నా నామ్కే వాస్తేగా కొద్దిమందికి మాత్రమే టెస్టులు నిర్వహించి కిట్స్ అయిపోయాయని పరీక్షలు బంద్ చేశారని మండిపడ్డారు.
దీంతో బాధితులు ఆగ్రహం తట్టుకోలేక అక్కడే ఉన్న టెంట్ను కూల్చి కుర్చీలను చెల్లాచెదురుగా పడేశారు. తక్షణమే తమకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ ముందే పైరవీకారులకు పరీక్షించారని ఇంకా క్యూలైన్ లలో వందల మంది ఉన్నారని పరీక్షలు నిర్వహిస్తే పోతామని పట్టుబట్టారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇతర వైద్యం చేయించుకోవాలన్నా కారోనా టెస్టులు అడుగుతున్నారని పరీక్షల కోసం ఇక్కడికి వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో సరికదాని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. సరిగ్గా లాక్ డౌన్ సడలింపు సమయం కావడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైద్యాధికారులు కరోనా పరీక్షల సమయం మార్చడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు మండిపడుతున్నారు. వారి అలసత్వం కారణంగా పోలీసులకు తలనొప్పిగా మారిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు.