- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్లకు పెద్దసాయం చేస్తున్న సోషల్ మీడియా
దిశ, వెబ్‌డెస్క్:
మెడికల్ స్కూల్‌లో డాక్టర్లు నేర్చుకున్న విధానాలు కరోనా పేషెంటును ట్రీట్ చేయడంలో విఫలమవుతున్నాయి. శ్వాసలో ఇబ్బందితో వచ్చి న పేషెంటుకి ముందు ఆక్సిజన్ మాస్కు ఇవ్వాలి, తర్వాత ట్యూబ్ ద్వారా ఆక్సిజన్ అందించాలి.. ఇవన్నీ చేసే సరికి పేషెంటు పరిస్థితి ప్రాణాల మీదకి వస్తోంది. అలాంటి సమయాల్లో ప్రతి వైద్యుడికి తోటి వైద్యుడి సాయం కావాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అందరు డాక్టర్లు ఒకచోట ఉండి పనిచేయడం కుదరదు. ఈ సమస్యను అధిగమించడానికే వారికి సోషల్ మీడియా సాయంగా నిలుస్తోంది.
డాక్టర్లు ఫేస్‌బుక్‌లో గ్రూపులు క్రియేట్ చేసుకుని పేషెంట్లకు చికిత్స చేయడంలో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పీఎంజీ కోవిడ్ 19 అనే సబ్ గ్రూపులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30వేల మంది డాక్టర్లు ఉన్నారు. వీరంతా కోవిడ్ లక్షణాలతో తమ వద్దకు వచ్చిన పేషెంట్లను తమకు వీలైన రీతిలో ట్రీట్ చేస్తున్నారు. వారి ట్రీట్‌మెంట్‌లో భాగంగా విఫలమైన విధానాలన్నింటినీ డాక్టర్లు గ్రూపులో పంచుకుంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాటి వైద్యులకు విఫలమైన విధానాలు కాకుండా వేరే కొత్త విధానాలు ప్రయత్నించే అవకాశం కలుగుతోంది. కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా ట్విట్టర్, టెలిగ్రామ్‌లలో కూడా గ్రూపుల క్రియేట్ చేసి, సామాజిక సేవలో వైద్యులు భిన్నకోణంలో భాగస్వామ్యం అవుతున్నారు.
Tags: corona, COVID 19, Doctors, Social media, Groups, help, treatment