- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైద్యురాలి సేవ భేష్.. భారతీయుల స్ఫూర్తి ఇదే : ప్రధాని
దిశ, వెబ్ డెస్క్: కరోనా బాధితులకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ కట్టడిలో భారతీయ వైద్యులు నిర్వరామంగా శ్రమిస్తున్నారు. ఇంటికి దూరంగా ఉండటమే కాకుండా, నిరంతరం బాధితుల పర్యవేక్షణలో గడుపుతూ.. నిద్రాహారాలకు కూడా దూరమవుతున్నారు. కరోనా పోరులో వైద్యబృందం అందిస్తున్న సేవలు అభినందనీయమని యావత్ దేశ ప్రజలు కొనియాడుతున్నారు. తాజాగా కరోనా బాధితుల చికిత్సలో భాగంగా 20 రోజులపాటు ఇంటికి వెళ్లకుండా.. ఆసుపత్రికే పరిమితమైన ఓ వైద్యురాలు ఎట్టకేలకు ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులు ఆ వైద్యురాలికి ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రధాని మోదీ కూడా ఈ వీడియోపై స్పందించారు.
‘వైద్యో నారాయణో హరి’అనే మాటల్లోనే వైద్యుల గొప్పతనమేంటో తెలిసిపోతోంది. కరోనా సమయంలో అది మరింత నిరూపితమైంది. కోవిడ్ పోరులో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించి ఇంటికి తిరిగి వచ్చిన ఓ వైద్యురాలికి ఘనమైన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులతో పాటు, స్థానికుల ఆమెను చప్పట్లు, పూలతో అభినందించడంతో… ఆ వైద్యురాలు భావోద్వేగానికి గురైంది. వైద్యుల సేవలను కీర్తిస్తూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘ఇలాంటి ఘటనలు మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇదే భారతీయుల స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో కరోనా పై ధైర్యంగా పోరాటం చేద్దాం. ఈ పోరులో ముందు నిలిచి అలుపెరగని సేవలందిస్తున్న వైద్యులను, చూసి గర్వంగా ఉంది’ అని ప్రధాని మోదీ స్పందించారు. ‘డాక్టర్లు, వైద్య బృందం, పోలీసులు, లెజెండ్స్ అని, వారికి ఇలాంటి గౌరవం తప్పకుండా దక్కాలని.. దానికి ఇదే తగిన సమయం’ ‘ చాలా రోజుల తర్వాత ఓ మంచి సన్నివేశాన్ని చూశాను. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. వైద్యుల్ని చూస్తే ఎంతో ధైర్యంగా ఉంది’ అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు
tags: corona virus, doctors, social media,twitter, pm modi