- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్ట్ పేరుతో నగ్నచిత్రాలు.. ఆపై అత్యాచారాలు
దిశ, వెబ్‌డెస్క్: చికిత్స కోసం వచ్చిన మహిళపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. మధ్యప్రదేశ్ ఇటార్సీ నగరంలోని ఓ ప్రముఖ క్లినిక్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్‌కు వచ్చిన ఓ మహిళపై కన్నేసిన క్లినిక్ డాక్టర్ ప్రదీప్.. టెస్టులు చేయాలి అంటూ ఆమె నగ్న చిత్రాలను రహస్యంగా తీశాడు.
ఆ తర్వాత టెస్టుల పేరిట క్లినిక్‌కు పిలుపించుకొని నగ్న చిత్రాలను చూయించి బెదిరించాడు. తన కోరిక తీర్చకుంటే ఈ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇలా ఆమెతో ఏకంగా కొన్ని రోజుల పాటు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ వ్యవహారంలో ఆ డాక్టర్‌కు కాంపౌండర్ కూడా సహకారం అందించడాని అనుమానాలు ఉన్నాయి. ప్రతి రోజు ప్రదీప్ ఇబ్బంది పెట్డడంతో విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
సాధారణంగా ఆ ఆస్పత్రికి పేషంట్ల సంఖ్య తక్కువగా ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. ఎవరైనా మహిళలు చికిత్స కోసం వస్తే ప్రదీప్ నగ్న చిత్రాలను చూపి లొంగదీసుకునేవాడని పోలీసులు గుర్తించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో చాలా వరకు నగ్న చిత్రాలు, వీడియోలు ఉండడం గమనార్హం. ప్రదీప్ రాసలీలలు తెలుసుకున్న స్థానికులు ఆ ఆస్పత్రిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.