- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యం కోసం వచ్చిన మైనర్‌పై డాక్టర్ అత్యాచారయత్నం
by Sumithra |

X
దిశ, కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మైనర్ బాలికపై డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. సుచిత్ర ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(16)కు జ్వరం రావడంతో సాయంత్రం తన మామతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వచ్చింది. దీంతో మామను బయట కూర్చోబెట్టి హెల్త్ చెక్ చేయాలని బాలికను లోపలికి తీసుకెళ్లాడు. అనంతరం మెల్లగా ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆమె మామ లోపలికి వెళ్లి, డాక్టర్‌ను మందలించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story