- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థినులకు డాక్టర్ వేధింపులు.. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి..!
దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కొవిడ్ కేసులు విజృంభిస్తుంటే రోగులను పట్టించుకోవాల్సిన డాక్టర్ మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చెప్పింది వినకపోతే అది చేస్తా.. ఇది చేస్తా అని గత కొన్నిరోజులుగా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పెద్దాసుపత్రిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని పెద్దాసుపత్రిలో ఓ డాక్టర్ బరితెగించాడు. డ్యూటీ అయిపోయాక తన రూమ్ కు రావాలని, అందులో ఏసీ ఉందని విద్యార్థినులకు అసభ్యంగా ఫోన్ కాల్స్ చేస్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక వారు నెంబర్ బ్లాక్ చేసుకుంటే మళ్లీ కొత్త నెంబర్స్ నుంచి అదేపనిగా కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు.
బీచ్‌కు వస్తే కలిసి తిరుగుదామని చెప్పిన మాట వినకపోతే కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్ వేధింపులు ఎక్కువ కావడంతో ఓ విద్యార్థిని ఫోన్‌లోనే అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఇలానే పలువురు విద్యార్థినులను ఆ డాక్టర్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థినికి డాక్టర్‌కు మధ్య జరిగిన కాల్ సంభాషణ బయటకు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే, ఆ డాక్టర్ ఎవరు అనేది వివరాలు బహిర్గతం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.