కలెక్టరేట్‌, డబుల్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

by Shyam |
కలెక్టరేట్‌, డబుల్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
X

దిశ, నాగర్‌కర్నూలు :
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ ఎల్ శర్మన్ చౌహన్ ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణం కొల్లాపూర్ కూడలి సమీపంలో నిర్మాణంలోని నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ సముదాయాలను, పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టరేట్ నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంగా అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి పై రహదారులు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్అండ్ బీ అధికారులు భవన నిర్మాణాలను నాణ్యతతో, యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed