ఇంటి అద్దెకు వేధించొద్దు

by Shamantha N |
ఇంటి అద్దెకు వేధించొద్దు
X

కరోనా ధాటికి దేశం మొత్తం విలవిలాడుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ ప్రభావం పేద, మధ్య తరగతి వారిపై బాగా పడుతోంది. ఇక రోజువారి కూలీపై పని చేసే వారి పరిస్థితి ఉంటుంది. అందువల్ల అలాంటి వారి గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఇళ్లు అద్దెకు వచ్చిన యజమానులకు సీఎం కేజ్రీవాల్ ఓ విజ్జప్తి చేశారు. యజమానులు ఇంటి అద్దె కోసం రోజువారీ వేతనంపై పని చేసేవారిని వేధించొద్దని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కిరాయికి ఉండే వారి నుంచి ఓనర్లు బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని ఆయన కోరారు. కరోనా వల్ల ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యమైనా ఓనర్లు సహకరించాలని సూచించారు. అద్దె కోసం వారిని బలవంత పెట్టొద్దని కోరారు. కనీసం ఇంటి అద్దెను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకుని రోజువారీ వేతన జీవులను ఆదుకోవాలని కేజ్రీవాల్ కోరారు.

Tags: Do not harass a home rental,Delhi CM Kejriwal,On a daily wage,The method of installing a home rental

Advertisement

Next Story