తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు

by Shamantha N |
తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు డీఎంకే అధినేత స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ సమైక్యత, తమిళ సంస్కృతికి బీజేపీ ప్రధాన శత్రువు అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జన్సీని తలపిస్తున్నాయని అన్నారు. తమ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుందని స్టాలిన్ అన్నారు. కాగా, సోమవారం జరిగిన తమిళనాడు బీజేపీ వర్చువల్ మీటింగ్‌లో జేపీ నడ్డా డీఎంకేపై విమర్శలు గుప్పించారు. జాతీయ సమైక్యత వాదానికి డీఎంకే తూట్లు పొడుస్తోందని నడ్డా మండిపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story