- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ ఆస్పత్రులపై డిప్యూటీ DMHO మెరుపు దాడులు..
దిశ, అశ్వారావుపేట టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ప్రైవేటు ఆసుపత్రులపై భద్రాద్రి డిప్యూటీ డీఎంహెచ్ఓ వినోద్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని భద్రాచలం రోడ్‌లో ఉన్న వందన నర్సింగ్ హోమ్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఆస్పత్రి పరిసరాల్లోని అపరిశుభ్రతను చూసి అసహనం వ్యక్తంచేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆస్పత్రి వర్గాలు తీరు మార్చుకోకుండా, సరైన ప్రామాణికాలు పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
అయితే, ఆస్పత్రి పక్కనున్న చెత్తాచెదారం, బురద నీరుతో ఉన్న స్థలం తమది కాదని, సుమారు 30 ఏళ్లుగా ఎటువంటి రిమార్క్ లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అశ్వారావుపేట భగత్ సింగ్ బొమ్మసెంటర్, నందిపాడు గ్రామంలోని స్నేహ హాస్పిటల్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి పరిశీలించి రెండు ఆసుపత్రులను సీజ్ చేశారు.