ఆయన ఆశీర్వాదం తీసుకున్న డీకే అరుణ

by Shyam |
ఆయన ఆశీర్వాదం తీసుకున్న డీకే అరుణ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, ఆదివారం చిలుకూరు బాలాజీ స్వామివారి ప్రధానార్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం చిలుకూరు వచ్చిన ఆమె 2007లో దేవాదాయ చట్ట సవరణలో ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని సమర్పించినట్టుగానే కేంద్రంలో ధార్మిక పరిషత్ ద్వారా దేవాలయాల నిర్వహణ జరిగే అంశాన్ని గట్టిగా సమర్పిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. తమ కుటుంబానికి చిలుకూరు బాలాజీ అర్చక పరంపరకి దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా అరుణ గుర్తుచేసుకున్నారు.

Advertisement

Next Story