దివ్య భారతి రహస్య పెళ్లి.. తల్లిదండ్రులకు ఎలా తెలిసింది?

by Jakkula Samataha |
దివ్య భారతి రహస్య పెళ్లి.. తల్లిదండ్రులకు ఎలా తెలిసింది?
X

దిశ, సినిమా : క్యూట్ అండ్ బబ్లీ గర్ల్‌గా 16 ఏళ్లకే ఇండస్ట్రీకి పరిచయమైన దివ్య భారతి లైఫ్.. చాలా షార్ట్ అండ్ స్వీట్. 1974 ఫిబ్రవరి 25న జన్మించిన ఈ చిట్టిగుమ్మ బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని తన మ్యారేజ్ వెనకున్న సీక్రెట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దివ్యభారతి చనిపోయేటప్పటికి తన వయసు కేవలం 19 కాగా.. 18 ఇయర్స్‌లో నిర్మాత సాజిద్ నడియావాలాను రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తెలుగులో బొబ్బిలి రాజా(1990) సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. డైనమిక్ అండ్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రజెన్స్‌‌తో వెంటనే స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేయడం, ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లోకి ఎంటర్ కావడం చకచకా జరిగిపోయాయి. హిందీలో తన ఫస్ట్ ఫిల్మ్ ‘షోలా ఔర్ షబ్నమ్’ కాగా.. ఈ చిత్రంలో గోవింద హీరో. అయితే తనను నెక్స్ట్ ప్రాజెక్ట్ తమ బ్యానర్‌లోనే చేయాలని ఒప్పించేందుకు ప్రొడ్యూసర్ సాజిద్ నడియావాలా సెట్స్‌కు వచ్చాడట. ఈ క్రమంలో గోవింద తనను దివ్యభారతికి పరిచయం చేయడం.. తనే పార్ట్‌నర్‌గా కావాలని దివ్యభారతి తల్లిని అడగడం జరిగిపోయాయట. తల్లి ఓకే అన్నా.. తండ్రికి ఈ మ్యాచ్ నచ్చలేదట.

ఒకరోజు దివ్యభారతి తన తల్లికి ఫోన్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం.. సాక్షి సంతకం పెట్టాలని కోరిందట. కానీ తండ్రికి చెప్తేనే తాను ఇందుకు అంగీకరిస్తానని చెప్పినా.. సాజిద్‌ను 18 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత తండ్రికి డౌట్ రాకుండా సాజిద్‌తో కాకుండా అమ్మానాన్నతోనే ఇంట్లో ఉండిపోయిందట. అయితే పెళ్లి తర్వాత వచ్చిన దీపావళి రోజున సాజిద్ తన ఇంటికి వచ్చి పెళ్లి గురించి తండ్రికి చెప్పారట. కానీ దివ్యభారతి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయకుండానే.. పెళ్లయ్యాక పది నెలలకే బాల్కనీ నుంచి కిందపడి( ఏప్రిల్ 5, 1993) చనిపోయింది.

Advertisement

Next Story

Most Viewed