కలుషిత జలాల్లో.. అంతరించిపోతున్న అరుదైన జాతి

by Shyam |
Seahorse
X

దిశ, ఫీచర్స్ : ఈ భూమి‌మీద అంతరించిపోతున్న జీవుల జాబితాలో ‘సీ హార్స్’ కూడా ఒకటి. ఇటీవల కాలంలో వీటి సంఖ్య తగ్గిపోతూ.. ఎక్కడ కనిపించకపోయేసరికి వాటి మనుగడపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పశ్చిమ గ్రీస్‌లోని ‘ఐటోలికా’ అనే కలుషితమైన నీటి మడుగులో వందలాది సముద్ర గుర్రాలను డైవర్ల బృందం గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా సముద్రపు గుర్రాలు ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అధిక వృక్షసంపద, చెత్తచెదారంతో, కలుషితమైన ఐటోలికో మడుగు జలాల్లో డైవర్ల బృందానికి తాజాగా ఇవి తారసపడ్డాయి. అయితే ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలనీ, లేకపోతే ఆ జాతి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చేపలు పట్టడం, వాతావరణ మార్పులు ఇతర కారణాల వల్ల సముద్ర గుర్రాల జాతి అంతరించిపోతుందనీ, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశోధకులు.

సముద్ర గుర్రాల్లో మొత్తంగా 40 జాతులు ఉంటాయి. ఇవి తమ తోకలను ఒకదానితో ఒకటి కలుపుతూ జతగా ఈత కొట్టడానికి ఇష్టపడతాయి. నీటి అడుగున మొక్కల రంగును అనుకరించడం ద్వారా అవి నిటారుగా ఈత కొడతాయి. లాంగ్స్‌నౌట్ సముద్ర గుర్రం (హిప్పోకాంపస్ రీడి) నార్తర్న్ సముద్ర గుర్రం (హిప్పోకాంపస్ ఎరెక్టస్) లాంటివి పశ్చిమ అట్లాంటిక్‌లోని కరేబియన్ ప్రాంతంలో కనిపిస్తాయి. సాధారణ సముద్ర గుర్రం (హిప్పోకాంపస్ గుట్టులాటస్) మధ్యధరా సముద్రంతో పాటు అట్లాంటిక్‌లోని వార్మ్ ఏరియాలోనే ఉంటుంది. ఎల్లో సీ హార్స్(హిప్పోకాంపస్ కుడా) ఇండో-పసిఫిక్‌లో, పసిఫిక్ సముద్ర గుర్రం (హిప్పోకాంపస్ ఇంజెన్స్) కాలిఫోర్నియా నుండి పెరూ, తూర్పు పసిఫిక్ తీరంలో ఎక్కువగా కనిపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed