జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

by Shyam |   ( Updated:2020-05-07 06:33:18.0  )
జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
X

దిశ, మహబూబ్‎నగర్: ప్రజలకు సమాచారం చేరవేయడం జర్నలిస్టులకు ఎంత ముఖ్యమో.. అదే సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవడం అంతే ముఖ్యమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం టీయుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని షాద్‎నగర్, జడ్చర్ల, జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిపోర్టర్లు వార్తల సేకరణ సమయంలో తమ పరిసర ప్రాంతాలను గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. వారు తమ ప్రాణాలను పణంగాపెట్టి వార్తలను వ్రాయడం అభినందనీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

tag: Minister Srinivas Goud, Distribution, Essential Commodities, Journalists, Mahabubnagar

Advertisement

Next Story

Most Viewed