ఉగ్రవాద దాడి వెనుక భద్రతా వైఫల్యం ఉంది.. సమగ్ర విచారణ జరపాలి: CWC డిమాండ్

by Mahesh |
ఉగ్రవాద దాడి వెనుక భద్రతా వైఫల్యం ఉంది.. సమగ్ర విచారణ జరపాలి: CWC డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాద దాడిపై ఈ రోజు ఢిల్లీలో CWC అత్యవసర సమావేశంలో ఏర్పాటు చేశారు. ఉదయం 10. 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించగా.. రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జైరామ్ రమేష్, కుమారి సెల్జా, రమేష్ చెన్నితల వంటి సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం కోసం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చారు. కాగా ఈ సమావేశంలో ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులుకు బాధితుల కుటుంబాలకు సంతాపం (condolence) తెలుపుతూ.. సమావేశం ప్రారంభంలో మౌనం పాటించి..మృతులకు నివాళులు అర్పించారు. అలాగే ఉగ్రదాడి నుంచి పర్యాటకులను కాపాడే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన స్థానిక పోనీవాలా, గైడ్‌లు, అలాగే దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఎయిర్ ఫోర్స్ కార్పొరల్ తాగే హైల్యాంగ్‌లకు ప్రత్యేకంగా నివాళులు (Tributes) అర్పించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్లు..

ఉగ్రవాదుల దాడి గురించి చర్చించడానికి, తదుపరి చర్యలను రూపొందించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. కాగా ఇప్పటికే కేంద్ర ఈ రోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పహల్గామ్‌లో మూడంచెల భద్రత ఉన్నప్పటికీ దాడి జరగడం భద్రతా లోపాలు (Security flaws) కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ లోపాలపై సమగ్ర విచారణ (Comprehensive investigation) జరపాలని CWC డిమాండ్ చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి "హాట్ సమ్మర్" హెచ్చరికలు వచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం దాడికి కారణమని CWC ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దాడిని పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన చర్యగా చెప్పింది.. దాడిలో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రగా భావించింది. ఈ దాడికి వ్యతిరేకంగా.. ఉగ్రవాద నిర్మూలన (Elimination of terrorism)లో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.


Advertisement
Next Story

Most Viewed