- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్మితా సబర్వాల్ రాజకీయాల్లో చేరితే సరిపోతుంది.. ఆమె ఏనాడైనా BRS ను ప్రశ్నించిందా.. ప్రొ. నాగేశ్వర్ ఘాటు రిప్లై

దిశ,వెబ్ డెస్క్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో చేసిన రిట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో ఆమెకు ఏప్రిల్ 12న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మిత ఎక్స్ వేదికగా స్పందించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేశారు,వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా సబర్వాల్ ట్వీటర్ వేదికగా నిలదీశారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై ఘాటుగా స్పందించారు.
ఐఏఎస్ అధికారిణిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని,ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టడం సరికాదని అన్నారు. దాన్ని కన్నా రాజకీయాల్లో చేరితే సరిపోతుంది కదా అని వ్యంగంగా మాట్లాడారు. అంతే కాకుండా 'బీఆర్ఎస్ యాక్టివిస్ట్‌లాగా స్మితా ప్రవర్తిస్తోందనే విమర్శ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తోంది. ఆమె హెచ్‌సీయూ భూములపై మాట్లాడింది ఓకే.. దేశంలో జరుగుతున్న ఇతర పర్యావరణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదేం. ఎప్పుడైనా మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిందా..? పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఏనాడైనా ప్రశ్నించిందా..? మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల తరపున మాట్లాడిందా..? కాళేశ్వరం ప్రాజెక్టులో చెట్లను నరికితే నోరు విప్పిందా..? కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఇబ్బందికరంగా పోస్టులు పెడతా అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవుతుందా..? పాలిటిక్స్ చేయడం అవుతుందా..? ఆమె తీరు, పోస్టులు చూస్తుంటే పాలిటిక్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సివిల్ సర్వీసెస్‌లో ఉన్నవారు ఇలా చేయటం సరైంది కాదు.' అని నాగేశ్వర్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఇదే పరిస్థితి నెలకొంటే స్మితా సబర్వాల్ అసలు రియాక్ట్ అయ్యేదా సైలెంట్ అయ్యేదా అని నెటిజన్లకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపొయింది.
స్మితా సబర్వాల్కు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్@BRSparty pic.twitter.com/Qdo0TLYDa0
— Telangana Galam (@TelanganaGalam_) April 23, 2025