- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాకు ముందే వచ్చేసిన డిస్నీ ప్లస్
దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా ప్రసిద్ధిగాంచిన డిస్నీ సంస్థ భారత ఓటీటీ మార్కెట్లోకి అడుగుపెట్టేసింది. సరాసరిగా కాకుండా హాట్‌స్టార్ ద్వారా ఇది వచ్చేసింది. నిజానికి మార్చి 29న రావాల్సిన డిస్నీ ప్లస్ ముందుగానే హాట్‌స్టార్‌లో దర్శనమిచ్చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, వూట్ లాంటి ఓటీటీ సర్వీసులకు ఇది గట్టిపోటీ ఇవ్వనుంది.
గతేడాది 21ఫస్ట్ సెంచురీ ఫాక్స్‌ని కైవసం చేసుకోవడంతో హాట్‌స్టార్ కూడా డిస్నీలో భాగమైంది. డిస్నీ ప్లస్ రాకతో వారి ఒరిజినల్ షోస్ అయిన ద మాండలోరియన్, టిమోన్ అండ్ పుంబా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలో భారతీయులకు హాట్‌స్టార్‌లో చూడటానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని మార్వెల్ సినిమాల హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం కావడం వల్ల అవి అందుబాటులోకి రాలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. దాదాపు అన్ని మార్వెల్ సినిమాలో ఇంగ్లిషుతో పాటు భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా చూసే సదుపాయాన్ని హాట్‌స్టార్ కల్పించింది.
డిస్నీ ప్లస్ కంటెంట్ రాకతో హాట్‌స్టార్ ప్రీమియం ఛార్జీలు పెరుగుతాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పాత ఛార్జీల అంటే సంవత్సరానికి రూ. 999లకే హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చని స్టార్ ఇండియా ప్రకటించింది. అంతేకాకుండా ఇటీవల మోదీ గురించి జాన్ ఆలివర్ లాస్ట్ వీక్ టునైట్ షోలో చేసిన వ్యాఖ్యలను హాట్‌స్టార్ సెల్ఫ్ సెన్సార్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీయకుండా వ్యవహరిస్తోంది. వారి మనోభావాలను ఏ మాత్రం దెబ్బ తీసినా డిస్నీ ప్లస్ రాకతో ఆటంకాలు వస్తాయని భావించే ఇలాంటి పని చేసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
tags : Netflix, Hotstar, Disney plus, The Mandalorian, Marvel movies, Amazon Prime