- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇందిరాగాంధీ హత్య, పరిణామాలపై సిరీస్.. చిక్కుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
దిశ, సినిమా : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్ ‘గ్రహణ్’ చిక్కుల్లో పడింది. 1984 అల్లర్ల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) మహిళా అధ్యక్షురాలు బీబీ జాగిర్ కౌర్. రంజన్ చందేల్ దర్శకత్వంలో వచ్చిన ఎనిమిది ఎపిసోడ్స్ సిరీస్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన అల్లర్లతో దేశంలో నెలకొన్న పరిణామాలను చూపించారు.
సత్యవాస్ రాసిన చౌరాసి నవల ఆధారంగా తెరకెక్కిన ‘గ్రహణ్’లో సిక్కు పాత్ర అభ్యంతరకంగా ఉందని, కల్పిత పద్ధతిలో తెరకెక్కించారని ఆరోపించిన SGPC అధ్యక్షురాలు.. ఇది సిక్కు సమాజ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. అందుకే ఈ మారణహోమం ప్రత్యక్ష సాక్షి నిర్‌ప్రీత్ కౌర్ ద్వారా ‘గ్రహణ్’ వెబ్‌సిరీస్ నిర్మాత అజయ్ జి రామ్, సునీల్ ర్యాన్‌లకు లీగల్ నోటీసులు పంపంచినట్లు తెలిపారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కూడా నోటీసులు పంపించామని, వెంటనే సిరీస్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సున్నితమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.