- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ రిపోర్టర్ స్టీఫెన్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి’
దిశ ప్రతినిధి, మెదక్: పేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకు అక్షరరూపం ఇచ్చి ప్రభుత్వాలను కదిలించిన కలం యోధుడు దిశ రిపోర్టర్ చిన్నన్నోళ్ల స్టీఫెన్ కుమార్ అకాల మరణం కలిచివేసిందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ దేవీ ప్రసాద్ ఆకాంక్షించారు .
జర్నలిస్టుగా విశేష సేవలందించిన దిశ దినపత్రిక మెదక్ నియోజకవర్గ ఇంఛార్జ్ స్టీఫెన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
స్టీవెన్ విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాలలో పాల్గొని మెదక్ జిల్లాలో ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారంలో అండగా నిలిచాడని, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అనేక ప్రజా కార్మిక, ఉద్యోగ, వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజీలేని పోరాటంలో ముందు వరుసలో నిలబడ్డారని గుర్తు చేశారు. జర్నలిస్టుగా చిన్న వయసులోనే పేదల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన నిబద్ధతగల జర్నలిస్ట్ మరణం మెదక్ జిల్లాకు తీరని లోటన్నారు. విద్యార్థి నేతగా, జర్నలిస్టుగా స్టీవెన్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఎంతోమంది జర్నలిస్టులను ఇటీవల కరోనా కాటు వేయడం బాధాకరమని అన్నారు. స్టీవెన్ మృతిపట్ల మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డితో పాటు ఆయా ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.